అన్ని దేహములందును ఏకత్వమైయున్న చైతన్యమే సమిష్టిభావము.
కారణ సమిష్టి స్వరూపము - ఈశ్వరుడు
కారణ వ్యష్టి స్వరూపము - ప్రాజ్ఞుడు.
కార్య వ్యష్టి స్వరూపము - జీవుడు.
సూక్ష్మ సమిష్టి స్వరూపము - హిరణ్యగర్భుడు.
సూక్ష్మ వ్యక్తి స్వరూపము - తైజసుడు.
స్థూల సమిష్టి స్వరూపము - విరాట్ స్వరూపుడు.
స్థూల వ్యక్తి స్వరూపము - విశ్వడు.
స్థూల దేహమునకు సంబంధించిన చైతన్యమునకు విశ్వు డనియు, సూక్ష్మ దేహమైన మనస్తత్వమునకు తేజసు డనియు, కారణదేహమైన ఆత్మతత్వమునకు ఈశ్వరుడనియు పేర్లు. ఇట్టి పవిత్రస్వరూపముధరించి, ఒక్క మానవునియందే మూడు ఆకారములు వికసింపజేసి తద్వారా, లోకమునకు ప్రకటింపచేయటానికి ఈ ఆత్మతత్వమును బోధిస్తూ వచ్చారు.
(ఆ.రా.పు.352)